JGL: ఎండపల్లి మండలం రాజారాంపల్లి మార్కెట్‌కు అక్రమంగా పశువులను తరలిస్తున్నారన్న సమాచారంతో రామగుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. రెండు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 57 పశువులు, 5 మహీంద్రా క్యాంపర్ వాహనాలు, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలకు సంబంధించి 11 మందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు.
తెలంగాణ
పశువుల తరలింపు.. 11 మంది అదుపులోకి


