హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘కొండా సురేఖను బర్తరఫ్ చేయడం దారుణం’

NLG: బీసీ వర్గానికి చెందిన మహిళా మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరుఫ్ చేయడం అత్యంత దారుణమని బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపేందర్ మండిపడ్డారు. ఈ చర్య యావత్ బీసీ సమాజాన్ని అవమానించడమేనని అన్నారు. ఇతర వర్గాల నాయకులకు ఒక న్యాయం, బీసీలకు మరో న్యాయం వర్తింపజేయడం కాంగ్రెస్ పార్టీ పక్షపాత వైఖరికి నిదర్శనమని విమర్శించారు.