హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్మార్ట్ కార్డులు పంపిణీ

నిర్మల్ ముథోల్ రేషన్ డీలర్ దుకాణంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ షబానా బేగం ఎజాజోద్దీన్ ముఖ్య అతిథిగా పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. రేషన్ వ్యవస్థను మరింత సులభతరంగా ప్రజలకు అందించేందుకే ప్రభుత్వం ఈ స్మార్ట్ కార్డులను మంజూరు చేసిందని పేర్కొన్నారు.