KMM: ఎర్రుపాలెం మండలం సఖినవీడు గ్రామంలో జరుగుతున్న డిజిటల్ పంట సర్వేను AO బోయినపల్లి సాయి శివ శుక్రవారం పరిశీలించారు. ప్రతి కమతంలో రైతులు సాగు చేసిన పంటలు, రకాలు, నీటి వనరుల వివరాలను త్వరగా, కచ్చితంగా నమోదు చేయాలని వాలంటీర్లకు సూచించారు. రైతులు కూడా సర్వేలో భాగస్వాములై వివరాలు అందించాలని కోరారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అన్నదాతలు నష్టపోతారని తెలిపారు.
తెలంగాణ
డిజిటల్ పంట సర్వేను పరిశీలించిన ఏవో


