హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా మండల స్థాయి ఎస్జీఎఫ్ క్రీడలు

JN: చిల్పూరు మండలంలోని పల్లగుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రెండు రోజులుగా నిర్వహించిన మండల స్థాయి ఎస్జీఎఫ్ క్రీడా సెలక్షన్స్‌ శుక్రవారం ముగిశాయి. ఆర్గనైజింగ్‌ సెక్రటరీ దేవ్‌సింగ్‌ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. మండల స్థాయిలో విజేతలైన క్రీడాకారులు ఈనెల 10, 11 తేదీల్లో జనగామ మినీ స్టేడియంలో జరిగే జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారని దేవ్‌సింగ్‌ తెలిపారు.