హైదరాబాద్: 28°C
తెలంగాణ

వేలాది వినతిపత్రాలు.. సచివాలయం వద్ద హైడ్రామా

HYD: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు ఆధ్వర్యంలో కార్యకర్తలు, విద్యార్థులు గురువారం సచివాలయానికి భారీగా తరలివచ్చారు. వినతిపత్రాలు అందించేందుకు వచ్చిన వారిని పోలీసులు లోనికి అనుమతించకుండా అరెస్ట్ చేశారు. దీంతో వేలాది వినతిపత్రాలు సచివాలయం వద్దే పడిపోయాయి.