కామారెడ్డి ఇంటర్నేషనల్ హోటల్ సమీపంలో శుక్రవారం కారు, ఎలక్ట్రిక్ స్కూటీ ఢీకొన్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..ఈ ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందాడు. మరో బాలుడికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కామారెడ్డి పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
కారు-ఎలక్ట్రిక్ స్కూటీ యాక్సిడెంట్


