హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో 70 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

నాగర్‌కర్నూల్: జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో విద్యారంగానికి విశిష్ట సేవలు అందిస్తున్న 70 మంది ఉత్తమ ఉపాధ్యాయులను జిల్లా స్థాయిలో ఘనంగా సన్మానించనున్నట్లు డీఈఓ రమేష్ కుమార్ తెలిపారు. బోధనా ప్రతిభ, విద్యార్థుల విద్యాభివృద్ధికి చేసిన కృషి తదితర అంశాల ఆధారంగా ఉపాధ్యాయులను ఎంపిక చేసినట్లు చెప్పారు.