హైదరాబాద్: 28°C
తెలంగాణ

తెరిచి ఉన్న మోరి.. ప్రజలకు ఇబ్బందులు

VKB: పరిగి పట్టణంలోని 15వ వార్డులో మోరి తెరిచి ఉండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులు, వృద్ధులు అటువైపు వెళ్లేందుకు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రివేళ మోరి కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి మోరికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.