MBNR: బాలానగర్ (మం) గంగాధరపల్లి పరిధిలోని కుంట్లాపూర్ తండాలో తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ.. గిరిజనులు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. తాగునీటి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా స్పందించలేదని తెలిపారు.
తెలంగాణ
తాగునీటి సమస్యపై ఎమ్మెల్యే కాన్వాయ్ అడ్డగింత


