హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు బాలికలు

GDWL: నిజామాబాద్‌లో ఈ నెల 4 నుంచి 6 వరకు జరిగే రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు గద్వాల ఎంజేపీటీబీసీడబ్ల్యూ పాఠశాల బాలికలు ఎంపికయ్యారు. నందిని, పావని, నిహారిక, మానస, వెన్నెలను ప్రిన్సిపాల్‌ అలివేలి అభినందించారు. పోటీల్లో ప్రతిభ చాటి జిల్లాకు పేరు తేవాలని ఆకాంక్షించారు. క్రీడల్లో రాణిస్తే భవిష్యత్తులో ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు.