WNP: వనపర్తి జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా ఒక వైపునకు ఒరిగింది. దీంతో ఈదురు గాలులు వీస్తే ఎప్పుడు కూలుతుందోనని స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఏదైనా అవాంఛనీయ ఘటన జరగకముందే విద్యుత్ అధికారులు స్పందించి, కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేయాలని పట్టణవాసులు కోరుతున్నారు.
తెలంగాణ
ఒరిగిన విద్యుత్ స్తంభం.. పొంచి ఉన్న ప్రమాదం!


