హైదరాబాద్: 28°C
తెలంగాణ

సురేఖ తీరు ఆక్షేపణీయం: పీసీసీ చీఫ్

HYD: మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన సురేఖ కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ తెలిపారు. ఆమె పార్టీలో ఉంటే తగిన అవకాశం కల్పిస్తామని చెప్పారు. సురేఖ ఆవేశంతో మాట్లాడారని, ఇకపై అలా మాట్లాడకూడదని సూచించారు. బహిరంగంగా ఇష్టారాజ్యంగా మాట్లాడితే కాంగ్రెస్‌ ఒప్పుకోదని, ఆమె తీరు ఆక్షేపణీయంగా ఉండటంతోనే చర్యలు తీసుకున్నామని తెలిపారు.