హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాళం వేసిన ఇళ్లే వీరి టార్గెట్..!

JGL: భీమారం(M) రంగాపూర్‌లో తాళం వేసిన మూడు ఇళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. పెళ్లి నిమిత్తం కుటుంబ సభ్యులతో జగిత్యాలకు వెళ్లిన సమయంలో ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీ చేశారు. గ్రామస్థుల సమాచారంతో SI శ్రీధర్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీ కెమెరాల్లో ఓ వ్యక్తి ఇళ్లలోకి ప్రవేశించినట్లు గుర్తించారు. అనుమానితుడు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.