హైదరాబాద్: 28°C
తెలంగాణ

వంటావార్పులో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్‌నగర్‌లో బీఆర్ఎస్ వంటావార్పులో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మహిళలకు రక్షణ కరువైందని, రూ. 4000 పెన్షన్, తులం బంగారం, స్కూటీల హామీలతో మోసం చేశారని విమర్శించారు. కేసీఆర్ కిట్, రైతుబీమా ఆపేశారని, 400 ఎకరాలను 22Aలో పెట్టి కబ్జాలకు యత్నిస్తున్నారని ఆరోపించారు. అవినీతి మంత్రులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.