హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్‌ హామీలపై BRS నిరసన

BDK: పినపాక మండలంలో శుక్రవారం బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హామీల అమలుపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. మండల అధ్యక్షుడు పగడాల సతీష్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, మహిళలకు రూ.2,500, తులం బంగారం, దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్‌, రూ.4 వేల పింఛన్‌, పలు హామీల్లో విఫలమైందన్నారు.