మహారాష్ట్రలో ఘోర విషాదం చోటుచేసుకుంది. జాతీయ స్థాయి మహిళా రెజ్లర్ అశ్వినీ మనోహర్ పాల్ (30) తన ముగ్గురు పిల్లలతో కలిసి లోయలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో అశ్వినితో పాటు ఆమె కుమారుడు, కుమార్తె మరణించారు. మరో కుమార్తె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. భర్త, అత్తమామల వేధింపుల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
క్రీడలు
పిల్లలతో కలిసి లోయలోకి దూకిన మహిళా రెజ్లర్


