హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

NRPT: మక్తల్ మండలం చిట్యాల వాగు నుంచి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న 2 ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై రాజు తెలిపారు. స్థానిక యాదవ్ నగర్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా అటుగా వస్తున్న 2 ఇసుక ట్రాక్టర్లను ఆపి తనిఖీ చేయగా ఎటువంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో 2 ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.