BDK: మణుగూరు 100 పడకల ఆసుపత్రిలో సర్పంచ్ మాధవరావు, ఉప సర్పంచ్ సురేష్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని పలు వార్డులలో తిరుగుతూ రోగులకు అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో మెరుగైన నాణ్యమైన & అధునాతన వైద్యం అందించడమే లక్ష్యంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కృషి చేస్తున్నారన్నారు.
తెలంగాణ
వంద పడకల ఆసుపత్రిలో తనిఖీ...!


