హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కృష్ణాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలు

JGL: జగిత్యాల పట్టణంలోని చింతకుంట చెరువు సమీప శ్రీ సూర్య ధన్వంతరి ధనలక్ష్మి సహిత దేవాలయంలో శ్రావణ మాస కృష్ణాష్టమి సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ ధనలక్ష్మి సేవా సమితి ఆధ్వర్యంలో మహిళలు కుంకుమార్చన, చందనాభిషేకం, చెరుకు గడలతో అమ్మవారి అలంకరణ, లలితా సహస్రనామ పారాయణం చేశారు. అనంతరం ఒడి బియ్యం, ముడుపులు సమర్పించారు.