హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీకృష్ణ రుక్మిణుల వేషధారణలో అలరించిన చిన్నారులు

మెదక్ జిల్లా రామాయంపేట గోశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కన్నులపండువగా సాగాయి. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు శ్రీకృష్ణుడు, రుక్మిణీదేవిల మనోహర వేషధారణలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చిన్నారుల అభినయాలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరించాయి. గోపూజ అనంతరం నిర్వహించిన ఈ వేడుకల్లో స్థానికులు విశేష సంఖ్యలో పాల్గొని తిలకించారు.