హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

VZM: గాజువాకలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కుటుంబ సభ్యులతో కలిసి భక్తిశ్రద్ధలతో కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని శ్రీ రాధాకృష్ణుల దివ్య మూర్తులకు కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణుని దివ్యాశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండి, అందరి ఇళ్లలో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు వికసించాలని కోరుకున్నట్లు తెలిపారు.