హైదరాబాద్: 28°C
క్రీడలు

శ్రీచరణి సరికొత్త రికార్డ్

టీమిండియా తెలుగు క్రికెటర్ శ్రీచరణి సరికొత్త రికార్డు సృష్టించింది. ఆసియా కప్‌లో భాగంగా హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసింది. దీంతో ఈ ఏడాది 31 వికెట్లు పడగొట్టింది. తద్వారా ఒక క్యాలెండర్ ఇయర్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో పూనమ్ యాదవ్ (35 వికెట్లు-2018) అగ్రస్థానంలో కొనసాగుతోంది.