హైదరాబాద్: 28°C
క్రీడలు

CPLలో చరిత్ర సృష్టించిన దసున్‌ శానక

కరేబియన్ ప్రీమియర్ లీగ్(CPL)లో శ్రీలంక ఆల్‌రౌండర్ దసున్ శానక సరికొత్త చరిత్ర సృష్టించాడు. సెయింట్ కిట్స్ జట్టు తరఫున ఆడుతున్న అతడు.. సెయింట్ లూసియాతో మ్యాచ్‌లో కేవలం 39 బంతుల్లోనే సెంచరీ బాదాడు. దీంతో CPL చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. మొత్తంగా 43 బంతుల్లో 8 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 121 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.