హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కూలీ పెంపు కోసం సమ్మె

SRCL: సిరిసిల్లలో కాటన్ చీరల కార్మికులు, ఆసాముల కూలీ పెంపు కోసం చేపట్టిన సమ్మె ఐదో రోజుకు చేరింది. నెహ్రూనగర్ అంబాబాయ్ దేవాలయం వద్ద నిరసన కొనసాగించారు. ఒప్పందం ముగిసి రెండేళ్లు దాటినా కూలీ పెంచలేదని సీఐటీయూ పవర్‌లూమ్ కార్మికుల జిల్లా అధ్యక్షుడు కోడం రమణ ఆరోపించారు. చీరకు కార్మికులకు రూ.100, ఆసాములకు రూ.150 పెంచాలని డిమాండ్ చేశారు.