W.G: ఆకివీడు మండలం అజ్జమూరు ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆర్వీఎస్ నారాయణకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ప్రకటించింది. విద్యార్థులకు విద్యతోపాటు సామాజిక సేవా కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ వారిని చైతన్యవంతులను చేస్తున్నందుకు ఆయన సేవలకు ఈ గుర్తింపు లభించింది. అవార్డు దక్కడంపై నారాయణను పలువురు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
RVS నారాయణకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు


