హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రద్దీకి అనుగుణంగా ఆసుపత్రి అభివృద్ధి'

E.G: పెరుగుతున్న రోగుల రద్దీకి అనుగుణంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు, వైద్య పరికరాలు, రోగుల సౌకర్యాలను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాజమండ్రిలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. ఆసుపత్రి అభివృద్ధికి అవసరమైన సమగ్ర నివేదిక సమర్పించాలని సూచించారు.