కృష్ణా: మచిలీపట్నం బందరుకోట రామాలయంలో కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేణుగానంతో జగంతా మురిపించిన బాలగోపాలుడి కృపతో రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో సుఖసంతోషాలు, శాంతి, ఐశ్వర్యాలు ఎల్లప్పుడూ వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో భక్తులు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రామాలయంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు


