హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గణేష్ మండపాలు ఏర్పాటు పై జిల్లా ఎస్పీ సూచనలు

కోనసీమ: గణేష్ ఉత్సవాల సందర్భంగా మండపాల ఏర్పాటుకు ఎటువంటి చలానాలు చెల్లించాల్సిన అవసరం లేదని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా శుక్రవారం తెలిపారు. గణేష్ మండపాల నిర్వాహకులు సింగిల్ విండో విధానం ద్వారా అవసరమైన అన్ని అనుమతులను పొందవచ్చని సూచించారు. అనుమతుల కోసం ganeshutsav.net⁠ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు