హైదరాబాద్: 28°C
క్రీడలు

ఈనెల 19 నుంచి ఏపీఎల్ మ్యాచ్‌లు

ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (ACA) ఆధ్వర్యంలో ఉమెన్ APL షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 19 నుంచి 27 వరకు మంగళగిరి వేదికగా డే, నైట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫైనల్‌తో కలిపి మొత్తం 13 మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ఈ టోర్నీకి టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనుంది. ఈ మ్యాచ్‌లను చూసేందుకు ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పించారు.