హైదరాబాద్: 28°C
క్రీడలు

దక్షిణాఫ్రికాతో భారత్ వన్డే సిరీస్..?

వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ జరగనున్న విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. అయితే, ప్రపంచకప్ ముందు సఫారీ జట్టుతో సిరీస్ ఆడాలని భారత జట్టు భావిస్తోంది. ఇదే విషయమై BCCI కూడా దక్షిణాఫ్రికా బోర్డుతో మాట్లాడినట్లు సమాచారం. ఈ వన్డే సిరీస్‌లో కనీసం నాలుగు నుంచి ఆరు మ్యాచులు జరిగే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.