NTR: విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు, రామవరప్పాడులో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొని శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేశారు. మంచిని కాపాడి, చెడును అంతం చేసేందుకే శ్రీకృష్ణావతారం అన్నారు. ధర్మ పరిరక్షణకు శ్రీకృష్ణుని జీవితం ఆదర్శమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రసాదంపాడు, రామవరప్పాడులో ఘనంగా జన్మాష్టమి


