హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెలిగల్లులో శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్టాపన!

అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం మండలం వెలిగల్లు నూతన శ్రీకృష్ణ ఆలయంలో కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా విగ్రహ ప్రతిష్టాపన శోభాయమానంగా జరిగింది. ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు మణికంఠ శర్మ బృందం, ఈ పర్వదినాన శ్రీకృష్ణ ఆరాధన అత్యంత శుభప్రదమని తెలిపారు. అనంతరం దాత మిర్యాల హరికుమార్ సౌజన్యంతో మహా అన్నసంతర్పణలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు.