హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మాధవ స్వామి ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు

BPT: కారంచేడులోని శ్రీ మాధవ స్వామి దేవస్థానంలో శుక్రవారం శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో భక్తులు విష్ణు సహస్రనామం, భగవద్గీత పారాయణం చేశారు. అనంతరం స్వామివారి దర్శన భాగ్యం కల్పించి, అర్చక స్వామి కిరణ్ కుమార్ భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.