హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజా ప్రతినిధులకు ఆత్మీయ వీడ్కోలు'

NDL: ఐదేళ్లపాటు ప్రజా సేవకు అంకితమైన జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలకు సంజామల ఎంపీడీవో కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు లభించింది. ఈనెల 23తో వారి పదవి కాలం ముగియనుంది. దీంతో ఎంపీడీవో సాల్మన్ శుక్రవారం మాజీ జెడ్పీ ఛైర్మన్ మల్కిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి, ఎంపీపీ పోచా వెంకట రమాదేవి, ఎంపీటీసీ సభ్యులను ఘనంగా సన్మానించి, వారి సేవలను కొనియాడారు.