హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వర్షాల కోసం గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు

E.G: రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి మండలం దోనేలపాలెంలో శుక్రవారం వర్షాలు కురవాలని కోరుతూ మాజీ సర్పంచ్ సవిరాల చంద్రుడు ఆధ్వర్యంలో గిరిజనులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ సరిహద్దుల్లోని దూబాలమ్మ, గంగాలమ్మ దేవతలకు, గ్రామంలోని రామాలయంలో జలాభిషేకాలు చేసి నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.