హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీ విజయ దుర్గా దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు

కడపలోని శ్రీ విజయ దుర్గా దేవి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారికి జలాభిషేకం, కుంకుమార్చన, వివిధ అభిషేకాలు చేసి పూలతో అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.