హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

53వ డివిజన్‌లో పర్యటించిన నెల్లూరు నగర మేయర్

నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ సుజాత 53వ డివిజన్ ప్రాంతంలో శుక్రవారం పర్యటించారు. విజయ డైరీ సమీపంలో రోడ్డు ఆక్రమణ తొలగింపులో భాగంగా నిర్వాసితులైన కుటుంబాలకు జనార్దన్ రెడ్డి కాలనీలో నూతనంగా కేటాయించిన గృహాలకు సంబంధించి జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. నిర్వాసితుల కోసం ఏర్పాటు చేస్తున్న గృహాలకు సంబంధించి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామన్నారు.