హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేర నియంత్రణకు కఠిన చర్యలు..!

SS: కదిరి పట్టణంలో నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు టౌన్ సీఐ బి. వెంకటేశ్వర్లు తెలిపారు. రౌడీషీటర్లపై నిఘా, రాత్రి పహారా పటిష్టం చేశారు. రౌడీషీటర్ ముజ్జుపై పీడీ యాక్ట్ అమలు చేసి, 38 మందికి బాండ్‌ఓవర్ చేశారు. ఉల్లంఘనులపై 482 ట్రాఫిక్ కేసులు నమోదు చేసి రూ.5,43,740 జరిమానా వసూలు చేసినట్లు సీఐ వెల్లడించారు.