BPT: చీరాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రజాదర్బార్ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ప్రజల నుంచి స్వయంగా 17 అర్జీలు స్వీకరించారు. వీటిలో ఇంటి స్థలాలు, పింఛన్లు, సీఎంఆర్‌ఎఫ్ సహాయం కోరుతూ వినతులు వచ్చాయి. అర్జీలను పరిశీలించిన ఎమ్మెల్యే, సమస్యలను వేగంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
చీరాల ప్రజాదర్బార్ లో 17 వినతుల స్వీకరణ.


