హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కేసీ కెనాల్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే

NDL: దొర్నిపాడు మండలంలోని కేసీ కెనాల్‌ను ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ శుక్రవారం పరిశీలించారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. 16వ బ్లాక్‌ నుంచి నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. నీటి కొరతపై వైసీపీ నాయకులు ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమాలు మానుకోవాలని సూచించారు.