హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జంగారెడ్డిగూడెంలో మత్తు ఇంజక్షన్లు స్వాధీనం

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అధికారులు మెడికల్ ఏజెన్సీలపై దాడులు నిర్వహించారు. డాంగెనగర్‌లోని ఓ దుకాణంలో 7,550 ట్రెమడాల్ ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మీ శ్రీనివాస ఏజెన్సీ నిర్వాహకుడు కిశోర్ 20 వేల ఇంజక్షన్లను ధ్వంసం చేసినట్లు, మరో దుకాణానికి 3 వేల ఇంజక్షన్లు విక్రయించినట్లు అధికారులు గుర్తించారు.