హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి'

VZM: ప్రతిఒక్కరు తమ ఓటు హక్కును స్వేచ్చగా వినియోగించుకోవాలని బొబ్బిలి DSP గోవిందరావు సూచించారు. ఈ మేరకు ఇవాళ రామభద్రపురంలోని సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను ఆయన పరిశీలించారు. అనంతరం కోటశిర్లాం, మామిడివలస, ముచ్చర్లవలస, భూసాయవలసలో కేంద్రాలను సందర్శించారు. పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.