కృష్ణా: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తురాలు అస్వస్థతకు గురై మృతి చెందారు. మహా మండపం రెండో అంతస్తులో కె. పద్మ (61) అస్వస్థతకు గురికావడంతో దేవస్థాన అంబులెన్సులో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. ఆమె పెనమలూరు మండలం తాడిగడపకు చెందినవారిగా గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్
దుర్గమ్మ దర్శనానికి వచ్చి భక్తురాలు మృతి


