హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాధిత కుటుంబానికి బీమా చెక్ అందజేత

కోనసీమ: ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామానికి చెందిన సత్యవతి కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ తరఫున రూ.5 లక్షల ప్రమాద బీమా ఆర్థిక సాయం అందజేశారు. బాధిత కుటుంబానికి టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని గ్రామ పార్టీ అధ్యక్షులు పెండెం వెంకన్న, మండల ప్రధాన కార్యదర్శి గుడెల్ల నాగేంద్ర భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబు కు కృతజ్ఞతలు తెలిపారు.