హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ప్రజాదర్బార్‌తో ప్రజలకు భరోసా: ఎమ్మెల్యే

కోనసీమ: దేవరపల్లి మట్లదొడ్డిలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి స్వయంగా 39 వినతులను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. మిగిలిన సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు.