తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయి శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న 68,433 మంది స్వామివారిని దర్శించుకోగా, 30,229 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీకి రూ.4.68 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
భక్తి
శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు


