హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత స్టార్లకు బీసీసీఐ పిలుపు

సెప్టెంబరు 6 నుంచి ప్రారంభంకానున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్ తరఫున ఆడేందుకు భారత స్టార్లకు బీసీసీఐ నుంచి పిలుపునచ్చింది. టెస్టు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, పేసర్ మహ్మద్ సిరాజ్, దేవదత్ పడిక్కల్ ఈస్ట్‌ జోన్‌తో తలపడే సౌత్ జోన్ జట్టు తరఫున బరిలోకి దిగనున్నట్లు పీటీఐ వెల్లడించింది. ఈ ప్రతిష్టాత్మక పోరులో ఈ రెండు జట్లు ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి.