హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పశు వైద్యశాల తనిఖీ చేసిన డీడీ

NDL: సంజామల ప్రాంతీయ పశు వైద్యశాలను గురువారం ఆళ్లగడ్డ పశుసంవర్ధక శాఖ డీడీ డా.రమణయ్య సందర్శించారు. పశుగ్రాస కొరత లేకుండా రైతులు బహువార్షిక సాగును చేపట్టాలన్నారు. మిని గోకులం షెడ్డుల ఏర్పాటుకై పాడి రైతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఏడి డా.కొండారెడ్డి, పశువైద్యాధికారి కృష్ణకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.