KMR: జుక్కల్ పట్టణంలోని కిరాణా, బేకరీలు, స్వీట్ షాపుల్లో ఆహార భద్రతాధికారి విక్రమ్ గురువారం తనిఖీలు చేపట్టారు. FSSAI లైసెన్స్ లేకపోవడం, ఉత్పత్తులపై తయారీ తేదీ, FSSAI నంబర్ వంటి వివరాలు లేకపోవడాన్ని గుర్తించారు. అపరిశుభ్రంగా ఉన్న బేకరీలకు మెరుగుదల నోటీసులు జారీ చేశారు. ప్రతి వ్యాపారి లైసెన్స్ పొంది పరిశుభ్రతా ప్రమాణాలు పాటించాలన్నారు.
తెలంగాణ
బేకరీలు, స్వీట్ షాపుల్లో తనిఖీలు


